1. మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఇండియా పోస్ట్ (India Post) మీకు అద్బుతమైన అవకాశం అందిస్తోంది. కేవలం రూ.5,000 చెల్లిస్తే చాలు… పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ (Post Office Franchise) తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు. రెండు రకాల ఫ్రాంఛైజ్‌లను ఇస్తోంది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్.
2. ఇప్పటివరకు పోస్ట్ ఆఫీస్ లేని ప్రాంతంలో పోస్టల్ సేవలకు (Postal Services) డిమాండ్ ఉంటే అక్కడ ఫ్రాంఛైజ్ ఔట్‌లెట్ తెరిచి కౌంటర్ సర్వీసుల్ని అందించొచ్చు. ఇది కాకుండా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పోస్టల్ ఏజెంట్లు పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ అమ్మొచ్చు. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ద్వారా స్టాంప్స్, స్టేషనరీ అమ్మడం మాత్రమే కాదు రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్ లాంటి సేవల్ని అందించొచ్చు
3. వ్యక్తిగతంగా ఎవరైనా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూషన్స్, ఇతర సంస్థలు, పాన్ షాప్స్, కిరాణా షాప్స్, స్టేషనరీ దుకాణాలు నిర్వహించేవారు ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో, కొత్తగా ఏర్పాటయ్యే టౌన్‌షిప్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్స్, భారీ హైవే ప్రాజెక్ట్స్, కళాశాలలు, విద్యా సంస్థలు ఉన్నచోట పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ప్రారంభించొచ్చు.
4. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఫ్రాంఛైజ్ తీసుకోవడానికి అర్హులు కాదు. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవాలంటే కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు. కంప్యూటర్ సదుపాయాలు ఉండాలి. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవడానికి ఒక దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి కేవలం రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే చాలు.
5. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకుంటే డివిజనల్ హెడ్ దరఖాస్తును పరిశీలించి ఫ్రాంఛైజ్‌ను మంజూరు చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం 14 రోజుల్లో పూర్తవుతుంది. ఇక ఇప్పటికే పంచాయత్ సంచార్ సేవా కేంద్రాలు (PSSKs) ఉన్న గ్రామాల్లో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ప్రారంభించడానికి అనుమతి ఇవ్వరు.
6. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ద్వారా అందించే సేవలకు కమిషన్ లభిస్తుంది. ఒక్కో సర్వీస్‌కు కమిషన్ ఒక్కోలా ఉంటుంది. రిజిస్టర్డ్ ఆర్టికల్స్‌కి రూ.3, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ రూ.5 చొప్పున కమిషన్ వస్తుంది. ఒక నెలలో 1000 కన్నా ఎక్కువ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ బుక్ చేస్తే అదనంగా 20 శాతం కమిషన్ లభిస్తుంది. మనీ ఆర్డర్‌కు కూడా కమిషన్ ఇస్తోంది ఇండియా పోస్ట్.
7. రూ.100 నుంచి రూ.200 మధ్య మనీ ఆర్డర్‌కు రూ.3.50 కమిషన్ వస్తుంది. రూ.200 కన్నా ఎక్కువ మనీ ఆర్డర్‌కు రూ.5 కమిషన్ ఉంటుంది. పోస్టల్ స్టాంపులు, మనీ ఆర్డర్ ఫామ్స్, ఇతర స్టేషనరీ అమ్మితే 5 శాతం కమిషన్ లభిస్తుంది. రెవెన్యూ స్టాంప్స్, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీ స్టాంప్స్ అమ్మితే 40 శాతం కమిషన్ పొందొచ్చు .
indian post office franchise online apply
ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి..ఎక్కువ ఆదా పొందేలా ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్‌ను ఫ్రాంఛైజ్ తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది.
కేంద్రప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్ వర్క్‌ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 1.55లక్షల పోస్టాఫీస్‌లు ఉన్నాయి. అందులో 89 శాతం పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో సేవల్ని అందిస్తున్నాయి. అయితే కేంద్రం ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చెందుతున్న రూరల్, అర్బన్ ఏరియాల్లో సైతం ఈ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు 2019లో ఈ ఫ్రాంఛైజ్ స్కీంను అందుబాటులోకి తెచ్చింది.
పోస్టాఫీస్ ఫ్రాంఛైజీ తీసుకుంటే ఏం చేయాలి?
► స్టాంప్స్, స్టేషనరీని అమ్ముకోవచ్చు.
► బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ సర్వీస్‌లను అందించాల్సి ఉంటుంది
► పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (పీఎల్‌ఐ- ఏజెంట్)కు సంబంధించిన అమ్మకాలు, ప్రీమియంను కట్టించుకోచ్చు.
► పోస్టాఫీస్ పరిధిలోకి వచ్చే రీటైల్ సర్వీసులు అంటే బిల్స్, ట్యాక్స్, పన్నుల వసూళ్లు లేదా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
ఫ్రాంఛైజీకి కావాల్సిన అర్హతలు
► ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవాలంటే మినిమం 8వ తరగతి చదివి ఉండాలి. ఇక డిపాజిట్ కింద రూ.5000 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద చెల్లించాల్సి ఉంటుంది.
► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పోస‍్టాఫీస్ అధికారులు మీ దరఖాస్తును డివిజనల్ హెడ్‌కు పంపిస్తారు.
► అలా మీ ధరఖాస్తును చెక్ చేస్తారు. మీ ఫ్రాంఛైజీకోసం అప్లయ్ చేసిన ధరఖాస్తుకు చెందిన అడ్రస్‌ను పరిశీలిస్తారు. దీంతో పాటు ఫ్రాంఛైజీని నిర్వహించే సామర్ధ్యం ఉందా లేదా, కంప్యూటర్ సౌకర్యం ఉందా లేదా అని పరిగణలోకి తీసుకుంటారు.
► అనంతరం 14 రోజుల్లో ఫ్రాంఛైజీకి మీరు అర్హులు, కాదా అంశంపై నిర్ణయం తీసుకుంటారు.
ఫ్రాంఛైజీకి ఎవరికి? ఏ ప్రాంతంలో ఇవ్వరు
► 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి అవకాశం ఇవ్వరు.
► పోస్టాఫీస్ ఉద్యోగం చేస్తున్నా, లేదంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఫ్రాంఛైజీని తీసుకునేందుకు అనర్హులు
► పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ పథకంలో భాగంగా పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్లు ఉన్న గ్రామాలకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరు.
post office franchise 2021 apply online
How to Become a Franchisee?
Applicants for franchises would need to submit an application in a prescribed format. The selected franchisee will sign a Memorandum of Agreement with the Department .Criteria for selection have been fixed considering the need to select persons with the capacity to manage and market a range of products, along with a sense of the community needs and public aspects of the job, and willingness to accept technological options. For more details Click Here.
mockhub



post office franchise in telugu
రెండు లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్‌వర్క్ అభివృద్ధికి కృషి: నితిన్ గడ్కరీ.
2025 నాటికి రెండు లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను ప్రభుత్వం వేగవంతంగా అభివృద్ధి చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు…..
hanuman chalisa telugu
అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
Click here for hanuman chalisa telugu audio