hanuman chalisa telugu
hanuman chalisa telugu by Garimella Balakrishna Prasad and hanuman chalisa telugu by Sri Avadhutendra Saraswathi Swamij
Find out hanuman chalisa telugu lyrics, audio and video. hanuman chalisa is one of the most powerful poems dedicated to Lord Hanuman. Hanuman Chalisa is a popular mantra written by saint Tulsidas. The Hanuman Chalisa describes Hanuman’s qualities – his strength, courage, wisdom, celibacy, devotion to Rama and the many names by which he was known.
హనుమంతుడి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, అనారోగ్యాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రతి మంగళవారం .. శనివారాల్లో దేవాలయంలో గానీ, పూజా మందిరం దగ్గర గాని కూర్చుని ‘హనుమాన్ చాలీసా’ను 11 మార్లు పారాయణ చేయవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేయడం వలన, హనుమ అనుగ్రహంతో మనసులోని కోరికలు నెరవేరతాయి.
hanuman chalisa telugu by Garimella Balakrishna Prasad
hanuman chalisa telugu by Avadhutendra Saraswathi Swamiji
hanuman chalisa telugu by Sri Avadhutendra Saraswathi Swamiji has dedicated his life for the spiritual upliftment of the masses through Bhagavannama Sankeerthana. Click here for more details about swamiji
అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
అసమానమైన బలము కలవాడా!
బంగారు వర్ణముతో మెరిసిపోయే దేహము కలవాడా! అశోకవనమును నాశనము చేసినవాడా!
జ్ఞానులలో అగ్రగణ్యుడిగా పేర్కొనబడినవాడా!
సర్వ గుణములకు నిధి వంటి వాడా!
వానర శ్రేష్ఠులలో అగ్రగణ్యుడా!
శ్రీరామచంద్రునికి అత్యంత ప్రియమైన భక్తుడా! వాయుపుత్రుడా!నీకు నమస్కారము.!
దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
అర్థం – శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచెదను.
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ||
అర్థం – బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవనకుమారా (ఆంజనేయా) నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము.
ధ్యానమ్
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
సాగరమును ఆవుడెక్కలా భావించి దాటినవాడా! రాక్షసులను దోమలలాగా నలిపినవాడా! రామాయణమనెడి మహామాలలో రత్నము వంటి వాడా! వాయుపుత్రుడా! నీకు నమస్కారము.!
చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||
అర్థం – ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రమువంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము.
రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||
అర్థం – నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా, పవనసుత అను నామము కలవాడవు.
మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||
అర్థం – నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు,
కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||
అర్థం – బంగారురంగు గల దేహముతో, మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవి దుద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడవు.
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవూ సాజై || 5||
అర్థం – ఒక చేతిలో వజ్రాయుధము (గద), మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము (జెండా) పట్టుకుని, భుజము మీదుగా జనేయును (యజ్ఞోపవీతం) ధరించినవాడవు.
శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||
అర్థం – శంకరుని అవతారముగా, కేసరీ పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి.
విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||
అర్థం – విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధిచాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు.
ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || 8||
అర్థం – శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది, శ్రీ సీతా, రామ, లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు.
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |
వికట రూపధరి లంక జరావా || 9 ||
అర్థం – సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానకరూపము ధరించి లంకను కాల్చినవాడవు.
భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 ||
అర్థం – మహాబలరూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు.
లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 ||
అర్థం – సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీరఘువీరుడు (రాముడు) చాలా ఆనందించాడు.
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 ||
[** పాఠభేదః – కహా భరత సమ తుమ ప్రియ భాయి **]
అర్థం – అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని, తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైనవాడవు అని పలికెను.
సహస వదన తుమ్హరో యశగావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||
అర్థం – వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు.
సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||
యమ కుబేర దిగపాల జహా~ం తే |
కవి కోవిద కహి సకే కహా~ం తే || 15 ||
అర్థం – సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యావిశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు?
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||
అర్థం – నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రాముని తో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు.
తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా || 17 ||
అర్థం – నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికి తెలుసు.
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||
అర్థం – యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడిని (సూర్యుడిని) మధురఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు.
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||
అర్థం – అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక (ఉంగరమును) నోటకరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది?
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||
అర్థం – జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు.
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైసారే || 21 ||
అర్థం – శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైన అక్కడే ఉండిపోవాలి.
సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||
అర్థం – నీ ఆశ్రయములో అందరు సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు?
ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనో~ం లోక హాంక తే కాంపై || 23 ||
అర్థం – నీ తేజస్సును నీవే నియంత్రిచగలవు. నీ కేకతో మూడులోకాలు కంపించగలవు.
భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జబ నామ సునావై || 24 ||
అర్థం – భూతములు, ప్రేతములు దగ్గరకు రావు, మహావీర అనే నీ నామము చెప్తే.
నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||
అర్థం – రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి, ఓ హనుమంతా! వీరా! నీ జపము వలన.
సంకట సే~ం హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||
అర్థం – మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి, ఓ హనుమంతా, నీవు విముక్తునిగా చేయగలవు.
సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || 27 ||
అర్థం – అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు.
ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై || 28 ||
అర్థం – ఎవరు కోరికలతో నీవద్దకు వచ్చినా, వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు.
చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||
అర్థం – నాలుగుయుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది.
సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||
అర్థం – సాధువులకు, సంతులకు నీవు రక్షకుడవు. అసురులను అంతము చేసినవాడవు, రాముని ప్రేమపాత్రుడవు.
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || 31 ||
అర్థం – ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది.
రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా || 32 ||
అర్థం – నీ వద్ద రామరసామృతం ఉన్నది. దానితో ఎల్లప్పుడు రఘుపతికి దాసునిగా ఉండగలవు.
తుమ్హరే భజన రామకో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 ||
అర్థం – నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి, జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను.
అంత కాల రఘువర పురజాయీ |
జహా~ం జన్మ హరిభక్త కహాయీ || 34 ||
అర్థం – అంత్యకాలమున శ్రీరఘుపతి పురమునకు వెళితే, తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడుతారు.
ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ || 35 ||
అర్థం – వేరే దేవతలను తలుచుకునే అవసరంలేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు.
సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || 36 ||
అర్థం – కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి, ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో.
జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరో గురుదేవ కీ నాయీ || 37 ||
అర్థం – జై జై జై హనుమాన స్వామికి. గురుదేవుల వలె మాపై కృపను చూపుము.
జో శత వార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ || 38 ||
అర్థం – ఎవరైతే వందసార్లు దీనిని (పై శ్లోకమును) పఠిస్తారో బంధముక్తులై మహా సుఖవంతులు అవుతారు.
జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||
అర్థం – ఎవరైతే ఈ హనుమాన చాలీసాను చదువుతారో, వారి సిద్ధికి గౌరీశుడే (శివుడు) సాక్షి
తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||
అర్థం – తులసీదాసు (వలె నేను కూడా) ఎల్లపుడు హరికి (హనుమకు) సేవకుడిని. కాబట్టి నా హృదమును కూడా నీ నివాసముగ చేసుకో ఓ నాథా (హనుమంతా).
దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||
సియావర రామచంద్రకీ జయ | పవనసుత హనుమానకీ జయ | బోలో భాయీ సబ సంతనకీ జయ |
అర్థం – పవన కుమారా, సంకటములను తొలగించువాడా, మంగళ మూర్తి స్వరూపా (ఓ హనుమంతా), రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము.
(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మ కు స్ఫురించి వ్రాయబడినది.)
Undoubtedly Shri Balakrishna Prasad Ji is a Hanuman Upasaka. And his blessings are with him. Otherwise this would have not been sung in this way. Very Very Divine and we are enjoying the bliss every time we hear this. Jai Hanuman.
hanuman chalisa english
The Hanuman Chalisa is a Hindu devotional hymn addressed to the God Hanuman. Hanuman is a devotee of Rama, and one of the central characters in the Sanskrit epic Ramayana. The Hanuman Chalisa describes Hanuman’s qualities – his strength, courage, wisdom, celibacy, devotion to Rama and the many names by which he was known.
Introductory Dohas in Telugu
అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
Introductory Dohas
Atulita Baladhāmaṁ Svarṇaśailābha Dēhaṁ
Danujavana Kr̥śānuṁ Jñāninā Magragaṇyaṁ
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
Sakala Guṇa Nidhānaṁ Vānarāṇā Madhīśaṁ
Raghupati Priyabhaktaṁ Vātajātaṁ Namāmi
శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి
వరణం రఘువర విమలయశజో దాయక ఫలచారి
Śrī Gurucaraṇa Sarōjaraja Nijamana Mukura Sudhāri
Varaṇaṁ Raghuvara Vimalayaśajō Dāyaka Phalacāri
బుద్ధిహీనతను జానికై సుమిరే పవన కుమార్
బలబుద్ధి విద్యా దేహు మోహిహర హుకలేశ వికార్
Buddhihīnatanu Jānikai Sumirē Pavana Kumār
Balabuddhi Vidyā Dēhu Mōhihara Hukalēśa Vikār
The Chalisa Telugu
1. జయ హనుమాన జ్ఞాన గుణసాగర
జయ కపీశ తిహులోక ఉజాగర
The Chalisa
1. Jaya Hanumāna Jñāna Guṇasāgara
Jaya Kapīśa Tihulōka Ujāgara
2. రామదూత అతులిత బలధామా
అంజని పుత్ర పవన సుతనామా
2. Rāmadūta Atulita Baladhāmā
An̄jani Putra Pavana Sutanāmā
3. మహావీర విక్రమ బజరంగీ
కుమతినివార సుమతికే సంగీ
3. Mahāvīra Vikrama Bajaraṅgī
Kumatinivāra Sumatikē Saṅgī
4. కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచితకేశా
4. Kan̄cana Varaṇa Virāja Suvēśā
Kānana Kuṇḍala Kun̄citakēśā
5. హథవజ్ర అరుధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై
5. Hathavajra Arudhvajā Virājai
Kāndhē Mūn̄ja Janēvū Sājai
6. శంకర సువన కేసరి నందన
తేజ ప్రతాప మహాజగ వందన
6. Śaṅkara Suvana Kēsari Nandana
Tēja Pratāpa Mahājaga Vandana
7. విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివేకో ఆతుర
7. Vidyāvāna Guṇī Aticātura
Rāma Kāja Karivēkō Ātura
8. ప్రభు చరిత్ర సునివేకో రసియ
రామలఖన సీతా మన బసియా
8. Prabhu Caritra Sunivēkō Rasiya
Rāmalakhana Sītā Mana Basiyā
9. సూక్ష్మ రూపధరి సియహిదిఖావా
వికటరూపధరి లంక జరావా
9. Sūkṣma Rūpadhari Siyahidikhāvā
Vikaṭarūpadhari Laṅka Jarāvā
10. భీమరూపధరి అసుర సం హారే
రామచంద్రకే కాజ సవారే
10. Bhīmarūpadhari Asura Saṁ Hārē
Rāmacandrakē Kāja Savārē
11. లాయ సజీవన లఖన జియయే
శ్రీరఘువీర హరిఖి ఉరలాయే
11. Lāya Sajīvana Lakhana Jiyayē
Śrīraghuvīra Harikhi Uralāyē
12. రఘుపతి కిన్ హీ బహుత బడాయీ
కహ భరత సమతుమ ప్రియ భాయీ
12. Raghupati Kin Hī Bahuta Baḍāyī
Kaha Bharata Samatuma Priya Bhāyī
13. సహస్ర వదన తుమ్హరో యశగావై
అసకహి శ్రీపతి కంఠలగావై
13. Sahasra Vadana Tumharō Yaśagāvai
Asakahi Śrīpati Kaṇṭhalagāvai
14. సనకాది బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా
14. Sanakādi Brahmādi Munīśā
Nārada Śārada Sahita Ahīśā
15. యమ కుబేర దిగపాల జహాతే
కవి కోవిద కహిసకై కహాతే
15. Yama Kubēra Digapāla Jahātē
Kavi Kōvida Kahisakai Kahātē
16. తుమ ఉపకార సుగ్రీవ హికీన్హా
రామ మిలాయ రాజపద దీన్
16. Tuma Upakāra Sugrīva Hikīnhā
Rāma Milāya Rājapada Dīnhā
17. తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా
17. Tumharō Mantra Vibhīṣaṇa Mānā
Laṅkēśvara Bhayē Saba Jaga Jānā
18. యుగ సహస్ర యోజన పరభానూ
లీల్యో తాహీ మధుర ఫలజానూ
18. Yuga Sahasra Yōjana Parabhānū
Līlyō Tāhī Madhura Phalajānū
19. ప్రభు ముద్రికా మేలిముఖమాహీ
జలధిలాంఘిగయేఅచరజ నాహీ
19. Prabhu Mudrikā Mēlimukhamāhī
Jaladhilāṅghigayē’acaraja Nāhī
20. దుర్గమ కాజ జగతకే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేత
20. Durgama Kāja Jagatakē Jētē
Sugama Anugraha Tumharē Tēta
21. రామదుఆరే తుమ రఖవారే
హోతన ఆజ్ఞా బినుపైఠారే
21. Rāmadu’ārē Tuma Rakhavārē
Hōtana Ājñā Binupaiṭhārē
22. సబ సుఖలహై తుమ్హారీ శరనా
రుమ రక్షక కహూకో డరనా
22. Saba Sukhalahai Tumhārī Śaranā
Ruma Rakṣaka Kahūkō Ḍaranā
23. ఆపనతేజ సంహారో ఆపై
తీనో లోక హాంకతే కాంపై
23. Āpanatēja Sanhārō Āpai
Tīnō Lōka Hāṅkatē Kāmpai
24. భూత పిశాచ నికట నహి ఆవై
మహావీర జబనామ సునావై
24. Bhūta Piśāca Nikaṭa Nahi Āvai
Mahāvīra Jabanāma Sunāvai
25. నాసై రోగ హరై సబపీరా
జపత నిరంతర హనుమత వీరా
25. Nāsai Rōga Harai Sabapīrā
Japata Nirantara Hanumata Vīrā
26. సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జోలావై
26. Saṅkaṭasē Hanumāna Chuḍāvai
Mana Krama Vacana Dhyāna Jōlāvai
27. సబపర రామ తపస్వీ రాజా
తినకే కాజ సకల తుమ సాజా
27. Sabapara Rāma Tapasvī Rājā
Tinakē Kāja Sakala Tuma Sājā
28. ఔర మనోరధ జోకోయిలావై
తాసు అమిత జీవన ఫలపావై
28. Aura Manōradha Jōkōyilāvai
Tāsu Amita Jīvana Phalapāvai
29. చారోయుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధి జగత ఉజియారా
29. Cārōyuga Paratāpa Tumhārā
Hai Parasid’dhi Jagata Ujiyārā
30. సాధుసంతకే తుమ రఖవారే
అసుర నికందన రామదులారే
30. Sādhusantakē Tuma Rakhavārē
Asura Nikandana Rāmadulārē
31. అష్టసిద్ధి నవనిధి కే దాతా
అసవర దీన్హ జానకీ మాత
31. Aṣṭasiddhi Navanidhi Kē Dātā
Asavara Dīnha Jānakī Māta
32. రామరసాయన తుమ్హరే పాసా
సాదర తుమ రఘుపతికే దాసా
32. Rāmarasāyana Tumharē Pāsā
Sādara Tuma Raghupatikē Dāsā
33. మహావీర విక్రమ బజరంగీ
కుమతినివార సుమతికే సంగీ
33. Tumharē Bhajana Rāmakōbhāvai
Janma Janmakē Dhuḥkhabisarāvai
34. అంతకాల రఘుపతి పురజాయీ
జహ జన్మ హరిభక్త కహయీ
34. Antakāla Raghupati Purajāyī
Jaha Janma Haribhakta Kahayī
35. ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సేయి సర్వసుఖ కరయీ
35. Aura Dēvatā Cittana Dharayī
Hanumata Sēyi Sarvasukha Karayī
36. సంకట హటై మిటై సబ పీరా
జో సుమిరై హనుమత బలబీరా
36. Saṅkaṭa Haṭai Miṭai Saba Pīrā
Jō Sumirai Hanumata Balabīrā
37. జై జై జై హనుమాన గోసాయీ
కృపాకరో గురుదేవకీ నాయీ
37. Jai Jai Jai Hanumāna Gōsāyī
Kr̥pākarō Gurudēvakī Nāyī
38. యహశతవార పాఠకర జోయీ
ఛూటహి బంది మహసుఖహోయీ
38. Yahaśatavāra Pāṭhakara Jōyī
Chūṭahi Bandi Mahasukhahōyī
39. జో యహ పఢై హనుమాన చాలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా
39. Jō Yaha Paḍhai Hanumāna Cālīsā
Hōya Sid’dhi Sākhī Gaurīsā
40. తులసీ దాస సదా హరిచేరా
కీజై నాథ హృదయ మహ డేరా
40. Tulasī Dāsa Sadā Haricērā
Kījai Nātha Hr̥daya Maha Ḍērā
Concluding Doha in Telugu
పవనతనయ సంకట హరన
మంగల మూరతి రూప
రామ లఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్
Concluding Doha
Pavanatanaya Saṅkaṭa Harana
Maṅgala Mūrati Rūpa
Rāma Lakhana Sītā Sahita
Hr̥daya Basahu Surabhūp
“హనుమాన్ చాలీసా తెలుగు అర్థాలు”
అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజ వనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి.
అసమానమైన బలము కలవాడా!
బంగారు వర్ణముతో మెరిసిపోయే దేహము కలవాడా! అశోకవనమును నాశనము చేసినవాడా!
జ్ఞానులలో అగ్రగణ్యుడిగా పేర్కొనబడినవాడా!
సర్వ గుణములకు నిధి వంటి వాడా!
వానర శ్రేష్ఠులలో అగ్రగణ్యుడా!
శ్రీరామచంద్రునికి అత్యంత ప్రియమైన భక్తుడా! వాయుపుత్రుడా!నీకు నమస్కారము.!
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్.
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్.
సాగరమును ఆవుడెక్కలా భావించి దాటినవాడా! రాక్షసులను దోమలలాగా నలిపినవాడా! రామాయణమనెడి మహామాలలో రత్నము వంటి వాడా! వాయుపుత్రుడా! నీకు నమస్కారము.!
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.
బాష్పవారి పరిపూర్ణ లోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్.
ఎక్కడెక్కడ రఘునాథుడు కీర్తింపబడతాడో
అక్కడక్కడ నీళ్ళు నిండిన కళ్ళతో శిరస్సు వంచి నమస్కారము చేస్తూ ఉంటావు.
రాక్షసుల అంతు చూసే వాయుపుత్రా!నీకు నమస్కారము!
శ్రీగురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి |
శ్రీ గురుదేవులు ఆంజనేయస్వామి చరణ ధూళిచే
నా హృదయ దర్పణము శుభ్రపరచి చతుర్విధ పురుషార్థంబులనిచ్చు శ్రీరామచంద్రుని కీర్తిని
గానము చేతును.
బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేస వికార |
నా బుద్ధిహీనతను తెలిసినవాడనై ఓ పావనతనయా!
ఓ హనుమా! నిన్ను స్మరింతును.
ఓ ప్రభూ! నాకు బలము బుద్ధి విద్యలను ప్రసాదించి నాలోని పంచ క్లేశములను, షడ్వికారములను హరింపుము.
చౌపాయీ.
జయ హనుమాన జ్ఞానగుణసాగర –
జయ కపీశ తిహు లోక ఉజాగర | 1
అనంతములైన జ్ఞాన గుణముల యందు పరిపూర్ణుడైన
ఓ హనుమా! నీకు జయము.
మూడు లోకాలను ప్రకాశింప చేసే ఓ కపీశ్వరా
నీకు జయము.
రామదూత అతులిత బలధామా –
అంజనిపుత్ర పవనసుత నామా | 2
శ్రీరామచంద్రుని రాయబారీ!
సాటిలేని బలము గలవాడా!
అంజనీదేవి కుమారుడా!
పవన సుతుడను నామము కలవాడా!
మహావీర విక్రమ బజరంగీ –
కుమతి నివార సుమతి కే సంగీ | 3
మహావీరుడా! వజ్రము వంటి దృఢమైన దేహము
కలిగిన పరాక్రమవంతుడా!
దుర్బుద్ధిని తొలగించువాడా!
మంచిబుద్ధి గలవారికి సహాయపడువాడా!
కంచన వరన విరాజసువేసా –
కానన కుండల కుంచిత కేశా | 4
బంగారువన్నెతో మంచి వేషముతో ప్రకాశించువాడా! చెవులకు కుండలములు అలంకారములుగా కలిగి ఉంగరములు తిరిగిన తలవెంట్రుకలు కలిగినవాడా!
హాథ వజ్ర అరుధ్వజా విరాజై –
కాంధే మూంజ జనేవూ సాజై | 5
చేతిలో వజ్రమును ఆయుధమును మరియు జండాను ధరించి విరాజిల్లువాడా!
భుజమందు ముంజ గడ్డితో చేయబడిన యజ్ణోపవీతముతో శోభిల్లువాడా!
శంకరసువన కేసరీ నందన –
తేజ ప్రతాప మహాజగ వందన | 6
పరమేశ్వరుని పుత్రుడా! కేసరీ కుమారుడా!
తేజస్సు ప్రతాపములతో జగత్తంతటిచే పూజింపబడువాడా!
విద్యావాన గుణీ అతిచాతుర –
రామ కాజ కరివే కో ఆతుర | 7
విద్వంసుడా! గుణవంతుడా! అతి చతురుడా!
శ్రీరామ కార్యనిర్వహణలో ఎంతో ఆత్రము,
ఆతురత కలవాడా!
ప్రభు చరిత్ర సునివేకో రసియా –
రామ లఖన సీతా మన బసియా | 8
ప్రభువగు శ్రీరాముని చరిత్ర వినుటయందు
ఆసక్తి కలవాడా!
సీతారామ లక్ష్మణులను హృదయమునందు ధరించువాడా!
సూక్ష్మ రూపధరి సియహిదిఖావా –
వికట రూప ధరి లంక జరావా | 9
సూక్ష్మ రూపమును ధరించి సీతాదేవికి కనిపించితివి. పిదుప భయంకర రూపమును ధరించి లంకాపురిని కాల్చివేసితివి.
భీమ రూప ధరి అసుర సంహారే –
రామచంద్రకే కాజ సంవారే | 10
భయంకర వేషమును ధరించి లంకాపురి యందున్న రాక్షసులను చంపి శ్రీరామచంద్రుని సకల కార్యములను చక్కచేసితివి.
లాయ సజీవన లఖన జియాయే –
శ్రీరఘు వీర హరషి ఉరలాయే | 11
సంజీవనీ మూలిక తెచ్చి లక్ష్మణుని బ్రతికించితివి. అందుకు శ్రీరఘురాముడు సంతోషించి నిన్ను
తన హృదయమునకు హత్తుకొనెను.
రఘుపతి కీన్హీ బహుత బడాయీ –
కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12
శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా పొగడి
“సోదరా! నీవు నాకు భరతునితో సమానముగా ప్రియమైన వాడవు” అని పలికెను.
సహస్ర వదన తుమ్హరో యస గావై –
అసకహి శ్రీపతి కంఠ లగావై | 13
“నీ కీర్తిని భవిష్యత్తులో అందరూ వేనోళ్ళ గానం చేసి తరించెదరు గాక!” అని పలికి శ్రీరాముడు
నిన్ను కౌగలించుకొనెను.
సనకాదిక బ్రహ్మాది మునీశా –
నారద శారద సహిత అహీశా | 14
సనకాది ఋషులు, మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు, నారదుడు సరస్వతీదేవి మరియు ఆదిశేషుడు
యమ కుబేర దిగపాల జహాతే –
కవి కోవిద కహి సకే కహా తే | 15
యముడు కుబేరుడు దిక్పాలకులు నీ మహిమను వర్ణింపజాలనప్పుడు భూలోకమున కవులు పండితులు ఎట్లు సాధ్యమగును.
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా –
రామ మిలాయ రాజపద దీన్హా | 16
నీవు సుగ్రీవునికి ఉపకారమొనర్చితివి.
రామునితో అతనికి సఖ్యము గావింపచేసి
రాజ్యపదవిని ఇప్పించితివి.
తుమ్హరో మంత్ర విభీషణ మానా –
లంకేశ్వర భయే సబ జగ జానా | 17
నీ సలహాను పాటించి విభీషణుడు లంకకు రాజైన సంగతి లోకమంతటికీ తెలిసినదే.
యుగ సహస్ర యోజన పర భానూ –
లీల్యో తాహి మధుర ఫల జానూ | 18
రెండువేల యోజనములు అనగా 16 వేల మైళ్ళ దూరమున ఉన్న సూర్యుని తీయని పండుగా భావించి దానిని మింగితివి.
ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ –
జలధి లాంఘియే అచరజ నాహీ | 19
శ్రీరామచంద్రుడిచ్చిన ఉంగరమును నోట నుంచుకొని (రామ నామమును జపిస్తూ) సముద్రమును దాటితివి. ఇందులో ఆశ్చర్యము లేదు.
దుర్గమ కాజ జగత కే జేతే –
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20
ప్రపంచమునందు కఠినమైన కార్యములు ఎన్నెన్ని ఉన్నాయో అవి అన్నియూ నీ అనుగ్రహము వలన సరళములు కాగలవు.
రామ దుఆరే తుమ రఖవారే –
హోత న ఆజ్ఞా బిను పైసారే | 21
శ్రీరాముని ద్వారపాలకుడవు నీవు.
నీ ఆజ్ఞలేనిదే లోపలికి వెళ్ళుటకు ఎవ్వరికీ వీలులేదు.
(నీ అనుగ్రహము లేకుండా రాముని కృప ఎవరికీ దొరకదు)
సబ సుఖ లహై తుమ్హారీ శరణా –
తుమ రక్షక కాహూ కో డరనా | 22
నిన్ను శరణు పొందిన వారికి సమస్త సుఖములు లభించును.
నీవు రక్షకుడిగా ఉండగా ఎవరికినీ
భయపడవలసిన పనిలేదు.
ఆపన తేజ సంహారో ఆపై –
తీనోం లోక హాంక తే కాంపై | 23
నీ యొక్క ప్రకాశమునకు బలపరాక్రమములను సంభాళించుకొనుటకు నీవే సమర్థుడవు.
నీ పెద్దకేక విని ముల్లోకములు కంపించును.
భూత పిశాచ నికట నహి ఆవై –
మహావీర జబ నామ సునావై | 24
ఓ మహావీరా! నీ నామస్మరణ వింటే భూతప్రేత పిశాచములు దగ్గరకు రావు.
నాసై రోగ హరై సబ పీరా –
జపత నిరంతర హనుమత వీరా | 25
నిరంతరము వీర హనుమంతుని జపించినచో
సమస్త రోగములు నశించును.
అన్ని పీడలు హరించుకుపోవును.
సంకటసే హనుమాన ఛుడావై –
మన క్రమ వచన ధ్యాన జో లావై | 26
ఎవరైతే మనోవాక్కాయ కర్మలచే తనను ధ్యానించినచో వారిని ఆంజనేయుడు సమస్త సంకటముల నుండి
విముక్తి చేయును.
సబ పర రామ తపస్వీ రాజా –
తిన కే కాజ సకల తుమ సాజా | 27
శ్రీరామచంద్రుడు తాపసులకు అందరకు గొప్పవాడు. ప్రభువు వంటివాడు.
ఆయన సకల కార్యములను ఓ ఆంజనేయా!
నీవు చక్కగా సవరించుచుందువు.
ఔర మనోరథ జో కోయీ లావై –
సోయీ అమిత జీవన ఫల పావై | 28
ఎవరు ఏయే కోర్కెలతో శ్రీ హనుమంతుని సేవింతురో వారికి ఆ కోర్కెలు తీరి అనంతమైన జీవన ఫల ప్రాప్తి కలుగును.
చారోం యుగ పరతాప తుమ్హారా –
హై పరసిద్ధ జగత ఉజియారా | 29
ఓ హనుమా! నీ యొక్క ప్రతాపము నాలుగు యుగములలోనూ ప్రసిద్ధమైనవి.
జగత్తంతయు నీ కీర్తి కాంతులతో ప్రకాశమానమై ఉన్నది.
సాధు సంతకే తుమ రఖవారే –
అసుర నికందన రామ దులారే | 30
సాధన చేసేవారికి చక్కగా తపస్సు చేసేవారికి
నీవు రక్షకుడవు. దుర్మార్గులను నాశనము చేయువాడవు మరియు శ్రీరామునికి అత్యంత ప్రియమైనవాడవు.
అష్ట సిద్ధి నవ నిధికే దాతా –
అసవర దీన జానకీ మాతా | 31
అష్టసిద్ధులను నవవిధులను ప్రసాదింపగలుగునటుల జానకీ మాత నీకు వరమొసగెను.
రామ రసాయన తుమ్హరే పాసా –
సదా రహో రఘుపతి కే దాసా | 32
రామరసాయనము నీవద్ద గలదు.
నీవు ఎల్లప్పుడూ శ్రీరామచంద్రుని సేవకుడవై ఉందువు.
తుమ్హరే భజన రామ కో పావై –
జనమ జనమ కే దుఃఖ బిసరావై | 33
నీయొక్క భజన వలన రామానుగ్రహము పొంది
జన్మ జన్మంతారముల దుఃఖముల నుండి
విముక్తి పొందెదరు.
అంత కాల రఘువర పుర జాయీ –
జహా జన్మ హరిభక్త కహాయీ | 34
(నిన్ను భజించినవారు) మరణించిన పిదప వైకుంఠమునకు పోవుదురు.
మరల జన్మించినచో వారు హరిభక్తులుగా
ప్రసిద్ధి చెందుదురు.
ఔర దేవతా చిత్త న ధరయీ –
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35
ఇతర దేవతలకు తన హృదయము నందు స్థానమీయక శ్రీ హనుమంతునే ధ్యానించు వారికి (ఆంజనేయుడు) సమస్త సుఖములను ఒసంగును.
సంకట కటై మిటై సబ పీరా –
జో సుమిరై హనుమత బలవీరా | 36
మహాబలుడగు ఆంజనేయుని ఎవరైతే స్మరింతురో
వారి సంకటములన్నియు తొలగి పీడలన్నియు నశించును.
జై జై జై హనుమాన గోసాయీ –
కృపా కరహు గురు దేవకీ నాయీ | 37
జితేంద్రియుడైన ఓ ఆంజనేయ!
నీకు జయము జయము జయము.
గురుదేవుని వలె (నాయందు) దయ జూపుము.
జో శత బార పాఠ కర కోయీ –
ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38
ఎవరైతే (ఈ చాలీసాను) నూరుమార్లు పఠనము చేయుదురో వారికి అన్ని బంధనములు వీడి
పరమానంద ప్రాప్తి కలుగును.
జో యహ పఢై హనుమాన చలీసా –
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39
ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను పఠింతురో
వారికి పార్వతీపరమేశ్వరుల సాక్షిగా సిద్ధికలుగును.
తులసీదాస సదా హరి చేరా –
కీజై నాథ హృదయ మహ డేరా | 40
ఓ నాధా (ఆంజనేయా!) ఈ తులసీదాసు ఎల్లప్పుడూ
హరి సేవకుడే కావున నా హృదయమందు నివసింపుము.
దోహా:
పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప |
సమస్త సంకటములను హరింప చేసెడివాడవు.
మంగళ స్వరూపుడవు,
సమస్త దేవతలకు నాధుడవు అయినా ఓ ఆంజనేయా! సీతారామ లక్ష్మణ సహితుడవై నా హృదయమున వసింపుము.
ashtalakshmi stotram in telugu