Home Balakrishna Prasad Garimella Annamacharya sankeerthanalu Annamacharya sankeerthanalu Amtayu Neve Hari pundareekaksha

Annamacharya sankeerthanalu Amtayu Neve Hari pundareekaksha

SHARE

అంతయు నీవే హరి పుండరీకాక్ష – చెంతనాకు నీవే శ్రీరఘురామ కులమును నీవే గోవిందుడా నా – కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా – నెలవును నీవే నీరజనాభ తనువును నీవే దామోదర నా – మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విఠ్ఠలుడా నా – వెనకముందు నీవే విష్ణు దేవుడా పుట్టుగు నీవే పురుషోత్త మ – కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు – నెట్టన గతి ఇంక నీవే నీవే