Home అష్టభైరవ సహిత శ్రీ మహాభైరవ సూర్య గ్రహణసాధన

అష్టభైరవ సహిత శ్రీ మహాభైరవ సూర్య గ్రహణసాధన

అష్టభైరవ సహిత శ్రీ మహాభైరవ సూర్య గ్రహణసాధన యాగము -June 21, 2020

 

 

21/06/2020 ఆదివారము, జ్యేష్ఠ అమావాస్య ఉదయం 10:15 ని నుండి మధ్యాహ్నం 1:40 ని వరకు ఉన్న సూర్యగ్రహణ సమయ ప్రత్యేక మంత్ర సాధన శ్లో|| ఆదిత్యాది గ్రహస్సర్వే భైరవావయవస్థితాః | తస్మాత్ భైరవ హోమస్తు గ్రహదోషనివారణం || ప్రత్యేకం గ్రహణే కాలే అమాయం భానువాసరే | మహాభైరవ యాగస్తు మంత్రమార్గే విధీయతే || అని భైరవ తంత్రంలో ఉన్నది – అంటే ఆదిత్యాది నవగ్రహములు మహాభైరవుని శరీర అవయవములుగా భాసిల్లుతున్నాయి. అష్టభైరవులు అష్టదిక్కులలో ఆ మహాభైరవుని సేవిస్తుంటారు. అష్టభైరవ సహిత మహాభైరవ మంత్ర సాధన, అర్చన, యాగము అన్ని నవగ్రహ దోషములను తొలగించి ప్రతికూల పరిస్థితుల నుండి రక్షించటం మాత్రమే కాక సర్వ అనారోగ్యములను, ఆపదలను, ఉపద్రవములను, ఇబ్బందులను, కష్టములను, ప్రయోగబాధలను తొలగించి నవగ్రహ అనుకూలతను, దీర్ఘాయురారోగ్యములను, సంకల్పసిద్ధిని ఇస్తవి. అష్టదిక్కులనుండి భైరవశక్తి రక్షణగా నిలుస్తుంది. శక్తిమంతమైన, సర్వశ్రేష్ఠమైన ఈ మంత్ర సాధన, యాగము ఆదివారము అమావాస్య గ్రహణకాలంలో చేయటం అత్యుత్తమ ఫలితములను యిస్తుందని భైరవతంత్రం ఉటంకిస్తున్నది. ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ సమయంలో జూన్ 21-06-2020 ఆదివారము అమావాస్యనాడు ఉదయం 10:15 ని నుండి మధ్యాహ్నం 1:40 ని వరకు సూర్యగ్రహణం ఉన్నది. ఇది తామస శక్తులు మరింతగా విజృంభించే సమయం. వాటి దుష్ఫలితములను నివారించటానికి అతిభయంకరుడు, రుద్రస్వరూపుడు అయిన మహాభైరవుని అష్టభైరవులతోపాటుగా ఆవాహన చేసి యాగం జరిపించాలని కదిలే కాలభైరవులు, పరమపూజ్యులు శ్రీ స్వామివారు సంకల్పించారు. శ్రీ స్వామివారి దివ్యసన్నిధిలో మొదటిసారిగా గ్రహణ సమయంలో విశాఖ శ్రీ లలితాపీఠంలో ఈ యాగం జరుగబోతున్నది. అదే సమయంలో భక్తులందరూ ఈ గ్రహణసాధన చేసి సత్ఫలితములను, భైరవానుగ్రహమును పొందగలరు. Website : http://www.siddheswaripeetham.org/ Facebook : https://www.facebook.com/Siddheswaran… Phone: +91 9063701687.